: బాధిత చిన్నారులను పరామర్శించిన బాబు
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. చిన్నారులు సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారి ఆరోగ్య పరిస్థితిని బాబు యశోదా ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.