: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!: రైలు డ్రైవర్ సత్యనారాయణ


మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మాసాయిపేటలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటన... బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నాందేడ్ ప్యాసింజర్ డ్రైవర్ సత్యనారాయణ చెప్పారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రమాదం జరిగే సమయానికి రైలు 90 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని... క్రాసింగ్ వద్ద నిరంతరాయంగా సైరన్ మోగించామని ఆయన చెప్పారు. రైలు వంద మీటర్ల దూరంలో ఉండగా బస్సు పట్టాల పైకి వచ్చిందని... బస్సును చూసిన వెంటనే తాము అత్యవసర బ్రేకులు వేశామని సత్యనారాయణ వివరించారు. కళ్లెదుట ఘోరం జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆయన ఆవేదనతో చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కోపోద్రిక్తులై రైలు డ్రైవర్లపై దాడికి దిగారు. దీంతో డ్రైవర్లిద్దరూ సికింద్రాబాదు లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News