: జడేజాకు ఐసీసీ జరిమానాపై బీసీసీఐ అసంతృప్తి
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ జరిమానా విధించడాన్ని బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తో గొడవపడిన నేపథ్యంలో జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడాన్ని బోర్డు ఆక్షేపించింది. ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ పై విషయాలు తెలిపింది. ఈ విషయంలో జడేజా తప్పు లేదని, అతనికి పూర్తి మద్దతు ఇస్తున్నామని బీసీసీఐ పేర్కొంది.