: రాష్ట్రపతిగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రణబ్
భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ నేటితో రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ప్రజలు మ్యూజియాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. వివిధ దేశాధినేతల నుంచి గత రాష్ట్రపతులు అందుకున్న బహుమతుల నుంచి చారిత్రక ప్రాధాన్యం ఉన్న వస్తువులు, చిత్రపటాల వరకు ఎన్నింటినో ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. తొలుత మూడు నెలల వరకు ప్రజలకు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తారు. రాష్ట్రపతి భవన్ లోని ప్రతీ దృశ్యాన్ని ఈ మ్యూజియం ప్రతిబింబిస్తుందని ప్రణబ్ అన్నారు.