: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్ 10 ఎం పిస్టల్ విభాగంలో మలైకా గోయల్ రజత పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ తొలిరోజున భారత్ ఏడు పతకాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.