: నేనూ రైతు బిడ్డనే.. అందుకే రుణమాఫీ చేశా: చంద్రబాబు
‘నేనూ రైతు బిడ్డనే’నని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే రుణమాఫీ చేశానని ఆయన చెప్పారు. ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అనంతపురం అని అన్నారు. అనంతపురం జిల్లాను బాగుచేసే వరకు విశ్రమించనని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం రైతులు పండ్ల తోటలు వేస్తే అధిక లాభం పొందవచ్చని, ప్రతి రైతు ఒక శాస్త్రవేత్త కావాలని ఆయన అభిలషించారు. పండ్ల తోటలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో ఉన్నదని బాబు చెప్పారు.