: దోమలతో వేగలేకపోతున్నారా?... అయితే, మొబైల్ తో దోమల్ని తోలేయండి!


రాత్రి నిద్రపోదామంటే చాలు ఝామ్ అంటూ దోమలు చెవుల దగ్గర ఒకటే రొద. పగబట్టినట్టు కుట్టినచోటే కుట్టి ప్రాణం తీస్తాయి. మస్కిటో కాయిల్ వెలిగిద్దామంటే అది వెలువరిచే వాసన భరిస్తూ పడుకోవడం అంటే బొగ్గు రైలింజన్ పొగపీల్చినట్టే. పోనీ, మస్కిటో ప్రొపలెంట్ వాడదామంటే దాని వాసనకు దోమలు పారిపోవు సరికదా పెరిగిపోతుంటాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య దోమల్ని వదిలించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక ఈ ప్రయత్నాలకు చెక్ చెప్పి మీ మొబైల్ ఫోన్ తో దోమల్ని పారదోలవచ్చని అప్లికేషన్ సృష్టికర్తలు భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం ఓ మొబైల్ అప్లికేషన్ రూపొందించారు. ఆ ఆప్లికేషన్ దోమలు అసహ్యించుకునే శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్ధం వింటే చాలు దోమలు పరుగందుకుంటాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఎమ్ ట్రాకర్ అనే ఈ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ లో దొరుకుతుందని, ఈ శబ్దాన్ని మన ప్రదేశానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. దీని వల్ల మనుషులకు ఏ విధమైన ఇబ్బంది కలగదని వారు హామీ ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News