: అక్క పిడిగుద్దులకు... చెల్లెలి ప్రేమకు పసందైన పోటీ!


బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా, యువనటి పరిణీతి చోప్రా ఫైటింగుకి సిద్ధమయ్యారు. ఒకరు పిడిగుద్దులతో కదనరంగంలోకి దూకితే, మరోకరు విందుభోజనం లాంటి ప్రేమతో సై అంటున్నారు. దీంతో అక్కా చెల్లెళ్ల పోటీపై బాలీవుడ్ లో ఆసక్తి రేగుతోంది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిగా నటించిన 'మేరీ కోం' సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుండగా, అదే రోజు పరిణీతి చోప్రా నటించిన 'దావతే ఇష్క్' సినిమా రిలీజ్ అవుతోంది. రియల్ బాక్సర్లతో ప్రియాంక బాక్సింగ్ చేసి శభాష్ అంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చేసిన ప్రతి సినిమాలో లిప్ లాక్ తో సంచలనం రేపే పరిణీతి చోప్రా ఈసారి 'ధావతే ఇష్క్' కోసం కూడా హీరోతో పెదాలు కలిపింది. గతేడాది వీరు నటించిన 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'జంజీర్' సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' ముద్దుల ఘాటుతో కాస్త పర్వాలేదనిపించగా, 'జంజీర్' మాత్రం ఫ్లాపుల లిస్టులో చేరింది. దీంతో ఈ ఏడాది వీరి సినిమాలు ఎలా ఆడుతాయా? అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News