: సచిన్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయాడు
సచిన్ టెండూల్కర్ హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో రెండు గంటలకు పైగా ఎదురుచూస్తున్నాడు. ముంబయి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం ఆలస్యమయింది. సాంకేతిక కారణాల వల్ల విమానం ఆలస్యమయిందని ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. వాస్తవానికి మధ్యాహ్నం 2.40 గంటలకు విమానం బయల్దేరాల్సి ఉండగా... సాయంత్రం ఆరుగంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. దాంతో, ఆ విమానంలో వెళ్లాల్సిన మిగతా ప్రయాణికులు సచిన్ తో పాటు పడిగాపులు గాస్తున్నారు.