: బికనీర్ జైల్లో గొడవ... ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు ఖైదీలు


రాజస్థాన్ లోని బికనీర్ కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మధ్య వివాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో ఒకరిపై ఒకరు కాల్చుకున్నారని జైలు అధికారులు చెప్పారు. బల్బీర్ బనుడా, జైప్రకాశ్, రాంపాల్ అనే ముగ్గురు ఖైదీలు ఈ ఘటనలో మరణించినట్లు వారు తెలిపారు. దీంతో జైలు సూపరింటెండెంట్ సరేంద్ర సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది.

  • Loading...

More Telugu News