: ప్రధాని మోడీని కలసిన కిషన్ రెడ్డి
భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మోడీ... ఎయిమ్స్ ఏర్పాటుపై పరిశీలించాలని వెంటనే మానవ వనరుల అభివృద్ధి శాఖను ఆదేశించారు.