: ఏపీలో ఎర్రచందనం నిల్వల విక్రయానికి ప్రభుత్వం ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం నిల్వలను అమ్మేందుకు నిర్ణయించింది. ఈ మేరకు 8,584.1363 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ఉత్తర్వులు జారీ చేసింది. గ్లోబల్ ఈ-టెండర్ల ద్వారా వీటిని అమ్మనుంది. మొదటి దశలో నాలుగువేల మెట్రిక్ టన్నుల గ్రేడెడ్ ఎర్రచందనాన్ని విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు వీటి అమ్మకపు బాధ్యతలను అప్పగించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. * ఏ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.12 లక్షలు. * బీ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.10 లక్షలు. * సీ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్నుకు రూ.8 లక్షలు. * నాన్ గ్రేడ్ ఎర్రచందనం ధర మెట్రిక్ టన్నుకు రూ.7 లక్షలు.

  • Loading...

More Telugu News