: వైఎస్ దోపిడీకి కొనసాగింపుగా కేసీఆర్ పాలన: రేవంత్ రెడ్డి
సిమెంటు ధరల పెంపు వెనుక కుట్ర ఉందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సిమెంటు కంపెనీలు బిల్డర్లకు మాత్రమే తక్కువ ధరకు ఇవ్వడానికి కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ దోపిడీకి కొనసాగింపుగా కేసీఆర్ పాలన ఉందన్నారు. మాసాయిపేట ప్రమాద ఘటనాస్థలిని సందర్శించే తీరిక కేసీఆర్ కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతోన్న 1956 స్థానికత అంశం వెనుక కుట్ర ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.