: కృష్ణాజిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
కృష్ణాజిల్లా కలిదిండిలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠా నాయకుడు వెంకన్న సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.5 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠా దొంగనోట్లను తెచ్చి ఇక్కడ చెలామణి చేస్తోంది. ఈ ముఠా గత ఎన్నికల్లోనూ దొంగనోట్లను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు.