: అనుష్కతో రిలేషన్ వల్ల కోహ్లీ ఆటపై ఎలాంటి ప్రభావం పడదు: కోచ్ రాజ్ కుమార్ శర్మ
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీలుదొరికినప్పుడల్లా ఈ జంట రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతారు. ఇటీవల ఇంగ్లండుతో ఆడిన టెస్టు మ్యాచుల్లో కోహ్లీ ఆటతీరుపై పలు విమర్శలు వచ్చాయి. ప్రియురాలు అనుష్క మోజులో పడి మనవాడు ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. వాటిపై విరాట్ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అనుష్కతో రిలేషన్ కోహ్లీ ఆటపై ఎలాంటి ప్రభావం చూపదంటున్నాడు. అతని ప్రాధాన్యతలేంటో అతనికి తెలుసునని, ఆటపైనే అతని దృష్టంతా ఉందని చెబుతున్నాడు. ఇరవై ఐదేళ్ల కుర్రాడయిన విరాట్ ఏం చేస్తున్నాడో తనకు తెలుసునని, వ్యక్తిగత జీవితాన్ని మేనేజ్ చేసుకోగలడని ధీమా వ్యక్తం చేశాడు.