: ధావన్ ప్లేసులో గంభీర్..?


ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్ పిచ్ లపై ఓపెనర్ శిఖర్ ధావన్ తడబడుతుండడాన్ని జట్టు మేనేజ్ మెంట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన గంభీర్ వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేం. అదే జరిగితే, మురళీ విజయ్ జతగా గంభీర్ సౌతాంప్టన్ టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. 2011లో ఇంగ్లండ్ టూర్లో భారత్ జట్టు ఘోర వైఫల్యాలు చవిచూడగా, అప్పుడు గంభీర్ కూడా జట్టులో ఉన్నాడు. ఇటీవల దేశవాళీ పోటీల్లో రాణింపు గంభీర్ కు మళ్ళీ టీమిండియాలో చోటు సంపాదించి పెట్టింది. ప్రస్తుత టూర్ కు ఈ ఢిల్లీ క్రికెటర్ ను రిజర్వ్ ఓపెనర్ గా ఎంపిక చేశారు. కాగా, ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు సౌతాంప్టన్ లో ఈనెల 27న ఆరంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి టెస్టు డ్రా కాగా, లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

  • Loading...

More Telugu News