: పార్టీ సమావేశానికి సోనియా ఒక్కరే వచ్చారు!


ఢిల్లీలో ఈ రోజు జరగాల్సిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశం అనుకోకుండా రద్దయింది. అసలు విషయం ఏమిటంటే, సమావేశానికి హాజరయ్యేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వచ్చారు. పది గంటలకు జరిగే ఈ భేటీకి ఎప్పటిలా కాకుండా ఓ అర్ధగంట ముందుగానే ఆమె వచ్చారు. అలా సమావేశ మందిరంలోకి వెళ్లిన ఆమె బిత్తరపోయారు. కారణం అక్కడ ఒక్కరంటే ఒక్క పార్టీ నేత కూడా లేరు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన సోనియా చేసేదిలేక సమావేశం క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారట. అయితే, పార్టీ నేతలెవ్వరికీ సమావేశం గురించి సరైన సమాచారం లేదని, అందుకే ఇలా జరిగిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News