: కేసీఆర్ కు గంటా హితవు
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. విద్యార్థులు జీవితాలను ప్రమాదంలో నెట్టేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. సమయం మించిపోతోందన్న గంటా, ఎంసెట్ కు ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు చెన్నైకి ఓ అధ్యయన బృందాన్ని పంపుతామని చెప్పారు.