: సైనా ట్వీట్... కేటీఆర్ ఆన్సర్!


ఒలింపిక్స్ పతకం గెలుచుకున్న అనంతరం బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వల్ కు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించడం తెలిసిందే. అయితే, ఇప్పటికీ ఆ బహుమతి చేతికి రాకపోవడంపై సైనా ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. సైనా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. సైనాతో పాటు షూటర్ గగన్ నారంగ్ (రూ.50 లక్షలు), కబడ్డీ క్రీడాకారిణులు మమతా పూజారి, నాగలక్ష్మి (చెరో రూ.25 లక్షలు) కూడా నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య తప్పక పరిష్కారమయ్యేలా చూస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వీరే కాకుండా రాష్ట్రానికి చెందిన ఒలింపియన్లంతా తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News