: పాక్ లో 26/11 కేసులో విచారణ వాయిదాపై భారత్ నిరసన
ముంబయి దాడుల కేసులో పాకిస్తాన్ లో జరుగుతున్న విచారణ ప్రతిసారీ వాయిదా పడుతుండటంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్ లోని ఆ దేశ విదేశాంగ కార్యాలయానికి వెళ్లిన భారత డిప్యూటీ హైకమిషనర్ ప్రభుత్వం తరపున నిరసన తెలిపారు. పాకిస్తాన్ అధికారులు నిర్వహిస్తున్న ప్రతి విచారణ వివరాలను తెలపాలని డిమాండ్ చేశారు. 2008లో జరిగిన ఘటనలో 166 మంది మరణించగా దాదాపు మూడు వందల మంది గాయాలపాలయ్యారు. ఆ ఘటనలో భారత్ కు పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు కోర్టు మరణశిక్ష విధించగా, 2012లో ఈ శిక్షను అమలు చేశారు.