: హైదరాబాదులో బులియన్ ఇండియా బ్రాంచ్
ఆన్ లైన్ లో బంగారం అమ్మకాలు, కొనుగోళ్ళు నిర్వహించే బులియన్ ఇండియా సంస్థ హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రం బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడంతో, పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పెట్టుబడులపై కన్నేసిన బులియన్ ఇండియా హైదరాబాదులో ఓ బ్రాంచి ఏర్పాటు చేసేందుకు నడుం బిగించింది. ఈ వివరాలను బులియన్ ఇండియా డైరెక్టర్ సచిన్ కొఠారీ తెలిపారు. గ్రాము బంగారం, గ్రాము వెండిని హోల్ సేల్ ధరలకే కొనే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు.