: మాసాయిపేట వద్ద రైల్వే గేటు ఏర్పాటు చేసిన అధికారులు


మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం అనంతరం రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మాసాయిపేట వద్ద రైల్వే గేటు ఏర్పాటు చేశారు. ఇక్కడ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో మూడు గ్రామాలకు చెందిన పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తెలిసిందే. దీంతో, రైల్వే గేటు ఏర్పాటు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే గేటు అమర్చారు.

  • Loading...

More Telugu News