: పెంపుడు కుక్కలూ అసూయపడతాయట!


అసూయ మనుషుల్లోనే కాదు పెంపుడు కుక్కల్లోనూ కనిపిస్తుందని పరిశోధకులంటున్నారు. యజమాని ప్రేమ తమకు మాత్రమే సొంతం కావాలని అనుకుంటాయట శునకాలు. కాలిఫోర్నియా యూనివర్శిటీ చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు తెలుసుకున్నారు. యజమాని మరో కుక్క మీద ప్రేమ చూపితే ఇవి తట్టుకోలేవని, చిన్న పిల్లల్లా ఉడుక్కుంటాయని వర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. వెంటనే నాటకీయ రీతిలో వాటి మోములో భావాలు మారిపోతాయట. యజమానిని నెట్టడం వంటి చేష్టల ద్వారా తమ అసూయను వ్యక్తం చేస్తాయని సదరు అధ్యయనం తెలుపుతోంది.

  • Loading...

More Telugu News