: వసీం అక్రమ్ తో స్నేహంపై పెదవి విప్పిన పాక్ నటి


పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తో తనకు లింకు పెడుతూ మీడియాలో వస్తున్న వార్తలపై నటి హుమైమా మాలిక్ స్పందించింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని వివరణ ఇచ్చింది. తామిద్దరం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని తెలిపింది. తమ మధ్య ఏదో ఉందన్న వార్తలు ఎక్కడ నుండి వస్తున్నాయో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది హుమైమా. 'అక్రమ్ ఓ వివాహితుడు, పైగా ఓ తండ్రి కూడా' అని పేర్కొన్నఈ ముద్దుగుమ్మ అతడిని గౌరవిస్తానని పేర్కొంది. ఇలాంటి పుకార్లు తమ చెలిమిని దెబ్బతీయలేవని స్పష్టం చేసింది. ఈ స్లిమ్ బ్యూటీ బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మి సరసన 'రాజా నట్వర్ లాల్' చిత్రంలో నటించనుంది. హుమైమా ఇంతకుముందు సంజయదత్ సరసన 'షేర్' సినిమాలో నటించింది.

  • Loading...

More Telugu News