: హోంమంత్రిని అడ్డుకున్నఎంఐఎం కార్యకర్తలు


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండులో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని రాజేంద్రగనర్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎంఐఎం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందనీ, తమ పార్టీ నేతలపై దౌర్జన్యం చేస్తోందని వారు సబితను నిలదీశారు. అనంతరం హోం మంత్రికి వినతిపత్రం అందించారు.

  • Loading...

More Telugu News