: గోవా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
గోవా మంత్రి దీపక్ ధవాలికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిస్తే భారత్ సంపూర్ణ హిందూ దేశంగా అవతరిస్తుందని అన్నారు. ప్రధాని ఈ దిశగా కృషి చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా... ఎన్నికల్లో మోడీ విజయాన్ని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమన్నది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని, గోవా ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ప్రతి అంశంపైనా ట్విట్టర్లో కామెంట్ చేస్తుంటారని, అదే తరహాలో దీనిపైనా ఆయన స్పందించాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ కోరారు. ఇక, ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రివర్యులు దీపక్ ఇటీవలే బికినీలపై కామెంట్ చేసిన గోవా రవాణా శాఖ మంత్రి సుదిన్ కు సోదరుడే!