: కేదార్ నాథ్ యాత్ర తాత్కాలికంగా రద్దు
ఉత్తరభారతంలో భారీవర్షాల నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను ఈ నెల 26వరకు నిలిపివేశారు. రిషికేశ్-కేదార్ నాథ్ మార్గమధ్యంలో డోలియాదేవి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. దీంతో, తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్టు డెహ్రాడూన్ జిల్లా అధికారులు ప్రకటించారు. అంతకుముందు కేదార్ నాథ్ యాత్ర జులై 16 నుంచి మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో నిలిపివేతను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, బద్రీనాథ్ యాత్రకు బుధవారం 140 మందితో కూడిన ఓ బృందం బయల్దేరి వెళ్ళింది. వారి గురించిన వివరాలు తెలియరాలేదు.