: కామన్వెల్త్ లో భారత్ బంగారు బోణీ
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. తొలి రోజు వెయిట్ లిఫ్టింగ్ అంశంలో 6 కేటగిరీల్లో పతకం కోసం పోటీలు నిర్వహించగా భారత్ 4 పతకాలతో సత్తా చాటింది. వాటిలో రెండు స్వర్ణ పతకాలుండడం విశేషం. మహిళల 48 కిలోల విభాగంలో సంజిత పసిడి సాధించగా, సైకోమ్ చాను రజితం దక్కించుకుంది. ఇక, పురుషుల 56 కిలోల కేటగిరీలో సుఖేన్ డే స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అదే విభాగంలో గణేశ్ మాలి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.