: చనిపోయాడనుకున్నారు... బతికొచ్చి హర్షం నింపాడు


చనిపోయాడని అంతా భావించారు... కానీ, అతను అనూహ్యంగా ఏడాది తర్వాత ఇంటికి చేరి ఆనందం నింపాడు. అదే సమయంలో అతను మరణించాడని నిర్థారించిన పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన దాళప్ప బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లాడు. అతను వెళ్లిన తరువాత జయమంగళ నదిలో 2013 మార్చి 20న గుర్తు తెలియని వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం దాళప్పదేనని అప్పటి హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, పరిగి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తి, నరసింహమూర్తి, మోదా గేటుకు చెందిన జిక్రియా దాళప్పను చంపారని పేర్కొంటూ జనవరి 23న కోర్టులో హాజరుపరిచారు. ఈ హత్యకేసు విచారణ సాగుతోంది. ఇంతలో దాళప్ప హఠాత్తుగా స్వగ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అతని హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఆనందంలో మునిగిపోయారు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు కేసులు ఎదుర్కొంటున్నవారు తెలిపారు.

  • Loading...

More Telugu News