: కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ ల దగ్గరే ప్రమాదాలు జరుగుతున్నాయ్


రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద కాపలాదారులు (గార్డులు) లేకపోవడమే ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. ఈ రైల్వే క్రాసింగ్ వద్ద వాహనాలు రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో ప్రమాదానికి గురవుతున్నాయి. మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం... ‘రైల్వే ట్రాక్ దాటే సమయంలో వాహన డ్రైవర్లు వాహనం నుంచి కిందకు దిగి, ఇరు వైపులా చూసి రైలు రావడం లేదని నిర్థారించుకున్న తర్వాతనే రైల్వే ట్రాక్ ను దాటాలి’. త్వరలో గమ్య స్థానాలకు చేరాలనే ఆత్రుత వాహనదారుల పట్ల శాపంగా మారుతోంది. మరో వైపు రైల్వే శాఖ గేట్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం కూడా ప్రమాదాలు జరిగేందుకు మరో కారణంగా కన్పిస్తోంది. ఏది ఏమైనా, ఇప్పటికైనా రైల్వే శాఖ మేల్కొని రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద గేట్ల ఏర్పాటు, గార్డుల నియామకం చేపడితే మున్ముందు మరిన్ని విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News