: కామన్ వెల్త్ గేమ్స్ లో భారతీయులకు మరో అవమానం
చైనాలోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారులకు అవమానం జరిగింది. జపాన్ తో జరిగిన బాస్కెట్ బాల్ తొలి మ్యాచ్ లో చైనా క్రీడాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మ్యాచ్ నిర్వహణ సందర్భంగా భారత కీలక ఆటగాళ్లైన అమృత్ పాల్, అమన్ జ్యోత్ లను తలపాగాలు తీస్తే కానీ మ్యాచ్ ఆడనిచ్చేది లేదని ఆదేశించారు. దీంతో వారిరువురూ తలపాగాలు తీసి మ్యాచ్ ఆడారు. దీనిపై భారత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కు సంప్రదాయమైన తలపాగాను తీయాలని నిబంధనలు ఎక్కడా లేవని కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు ఘాటుగా లేఖ రాశారు. అంతకు ముందు కామన్వెల్త్ గేమ్స్ అధికారిక గీతంలో భారత జాతీయ పతాకను తిరగేసి పట్టుకుని అవమానించారు. ఇది జాతి వైరం పెంచేలా ఉందని పేర్కొంటూ భారత క్రీడాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దీనిపై చైనా సమాధానం చెప్పాల్సి ఉంది.