: డిఫెన్స్ లో మురళీ విజయ్ ప్రపంచ రికార్డు


డిఫెన్స్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఓపిగ్గా ఆడే మురళీ విజయ్ తిరుగులేని డిఫెన్స్ తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టడంలో దిట్ట. ఐపీఎల్ లో టీట్వంటీకి తగ్గట్టు వేగంగా ఆడడంలోనూ, టెస్టుల్లో అత్యంత ఓపికతో డిఫెన్స్ ఆడడంలోనూ టీమిండియా దిగ్గజాలను మురళీ విజయ్ ఆకట్టుకుంటున్నాడు. టెస్టుల్లో పునరాగమనం తరువాత టెస్టు కెరీర్లో 2, 221 బంతులాడిన మురళీ విజయ్ కేవలం 12 బంతులను మాత్రమే క్షమించి వదిలేయడం విశేషం. దీంతో డిఫెన్స్ లో దిగ్గజాలను కాదని మురళీ విజయ్ ముందుకు దూసుకుపోయాడు. డిఫెన్స్ ఆడడంలో మురళీ విజయ్ తరువాతి స్థానంలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ మైఖేల్ వాన్ ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News