: నైజీరియాలో కూలిన అల్జీరియా విమానం
అల్జీరియా కు చెందిన ఎయిర్ బస్ ఎమ్ డి 83 విమానం అదృశ్యం చిక్కుముడి వీడింది. అల్జీరియాకు చెందిన ఎమ్ డి 83 ఎయిర్ బస్ నెంబర్ ఏహెచ్ 5017 విమానం నైజీరియాలోని నైజర్ నదిలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆఫ్రికాలోని బుర్కినా ఫోసా విమానాశ్రయం నుంచి అల్జీరియా బయల్దేరిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో నైజర్ నదిలో కుప్పకూలింది. ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో మూడో స్థానంలో ఉన్న నైజర్ నదిలో విమానం కుప్పకూలడంతో విమాన శకలాలకోసం అధికారులు గాలింపు చేపట్టారు. ఈ వారంలో ఇది మూడో విమాన ప్రమాదం. విమానం టేకాఫ్ అయిన 50 నిమిషాలకు గ్రౌండ్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రచంఢ గాలుల ప్రతాపానికి విమానం కూలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.