: లోపాలు ఎంచడం కాదు... ప్రమాదాలు నివారించండి: కోదండరాం
రైల్వే ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి అధికారుల లోపాలు ఎంచుతారు తప్ప సమస్యల పరిష్కారానికి చొరవ చూపరని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు. హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో క్షతగాత్ర బాలలను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 14 వేలకు పైగా రైల్వే గేట్లు లేని జంక్షన్లు ఉన్నాయని రైల్వే నివేదిక తెలుపుతోందని అన్నారు. ఈ జంక్షన్లలో గేట్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరని ఆయన ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.