: ఏడుకొండల వాడికి భక్తుడి 16 కోట్ల విరాళం
తిరుమల వెంకేశ్వరుడికి ప్రవాస భారతీయుడు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రామలింగరాజు భారీగా విరాళమిచ్చాడు. స్వామి వారికి సహస్రనామ కవచం కోసం 11 కోట్లు, తిరుచానూరులో అన్నదాన భవనం కోసం మరో 5 కోట్ల రూపాయలు విరాళంగా సమర్పించుకున్నాడు. ఈ మొత్తాన్ని టిటిడి చైర్మన్ బాపిరాజుకు చెక్ రూపంలో అందించాడు.