: బీహార్లో రెచ్చిపోయిన మావోలు... తెలుగువాళ్ళకు ఇక్కట్లు
బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గయ వద్ద రైల్వే ట్రాక్ ను పేల్చివేయడంతో ఢిల్లీ-హౌరా మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, 12 రైళ్ళు నిలిచిపోయాయి. నీలాంచల్ ఎక్స్ ప్రెస్ గోముఖ్ వద్ద నిలిచిపోగా, అందులో 500 మంది తెలుగువారున్నారు. వారందరూ కాశీయాత్రకు వెళుతున్నారు. అర్థరాత్రి నుంచి రైలు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.