: కుక్ బతికిపోయాడు!


ఇంగ్లండ్ జట్టు సారథ్య బాధ్యతలు మళ్ళీ ఆలిస్టర్ కుక్ కే అప్పగించారు. సౌతాంప్టన్ లో జరిగే మూడో టెస్టుకు కుక్ నాయకత్వం వహిస్తాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం కుక్ పై విమర్శకులు తీవ్రస్థాయిలో దాడి చేసినా, సెలక్టర్లు మాత్రం అతనిపైనే నమ్మకం ఉంచారు. మాజీ కెప్టెన్లు ఇయాన్ బోథమ్, మైకేల్ వాన్, బాబ్ విల్లీస్ తదితరులు కుక్ నాయకత్వ లోపాలను తూర్పారబట్టారు. ఇవేవీ పట్టించుకోని ఈసీబీ... కుక్ కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు ఈ నెల 27న ఆరంభవుతుంది. కాగా, కుక్ పైనే మరోసారి విశ్వాసం ఉంచడానికి ప్రధాన కారణం జట్టులో కెప్టెన్సీ చేపట్టగల సమర్థులు లేరన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News