: ఇషాంత్ శర్మ ఆవేదన
లార్డ్స్ లో 7 వికెట్లతో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 28 ఏళ్ళ తర్వాత భారత్ కు చారిత్రక విజయం లభించడంలో ఇషాంత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గతంలో తాను ఎన్నోసార్లు మెరుగైన ప్రదర్శన కనబరిచినా జట్టు సహచరులు తప్ప మరెవ్వరూ మెచ్చుకోలేదని వాపోతున్నాడీ పొడగరి. ఇప్పుడు మాత్రం లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అన్ని వికెట్లు తీయబట్టే ఇతరులు పొగుడుతున్నారని ఆక్రోశించాడు. ఏదేమైనా, జట్టు సభ్యులకు తనపై నమ్మకం ఉందని, జట్టు కోసం తన ప్రదర్శనను వారు మెచ్చుకున్నారని, అది చాలని పేర్కొన్నాడు.