: ఆరుగురు కాముకులు బాలికను కాటేశారు


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత బాలికను ఆరుగురు కాముకులు కాటేశారు. మధుర జిల్లాలోని పింగ్రి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఉత్సవానికి బాధిత దళిత బాలిక హాజరైంది. ఉత్సవం ముగిసిన అనంతరం చీకట్లో బహిర్భూమికి వెళ్లిన ఆ బాలికను ఆరుగురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగింది ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి ఆమెను విడిచిపెట్టారు. తీవ్రభయాందోళనలకు లోనైన బాలిక తెల్లవారాక జరిగిన ఘోరం తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్థారించిన పోలీసులు దాష్టీకానికి పాల్పడిన మనోజ్, గుడ్డు, సన్నో, రామ్ వీర్, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మహేష్ అరెస్టు కావాల్సి ఉందని పోలీస్ ఆఫీసర్ నితిన్ తివారీ తెలిపారు.

  • Loading...

More Telugu News