: మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. సాధారణంగా ప్రతిపక్షాలపై మండపడే దీదీ, ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతాలోని రావ్ ధాన్ వీధిలోంచి వెళ్తున్న సందర్భంగా ఓ కానిస్టేబుల్ బస్ షెల్టర్ లో బట్టలు మార్చుకోవడం ఆమె చూశారు. అంతే, కానిస్టేబుల్ ను పిలిచి బస్ షెల్టర్ లో ఎందుకు బట్టలు మార్చుకుంటున్నావని ఆమె ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రశ్నించేసరికి ఆ కానిస్టేబుల్ పై ప్రాణాలు పైకిపోయాయి. అయినా ధైర్యం తెచ్చుకుని ఇంకా ఏమని తిడతారో అని ఎదురు చూస్తుండగా, "బస్ షెల్టర్లు, బస్ స్టాండ్లు అనేవి ప్రజల సౌకర్యం కోసం. అలాంటి వాటిల్లో పోలీసులు దూరి బట్టలు మారుస్తుంటే సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించావా? అని ప్రశ్నించారు. అయినా యూనిఫాంతో ఇంటికి వెళ్లడమే గౌరవం" అని ఆమె సూచించారు. 'ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడి బస్ షెల్టర్లను దుర్వినియోగం చేయవద్ద'ని ఆమె హితబోధచేశారు. శిక్షిస్తారేమో అని భయపడిన పోలీసు హితబోధతో సరిపెట్టడంతో బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News