: ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి: బొత్స
రైతు రుణమాఫీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట చెబుతున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రూ. లక్షన్నర రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారో కచ్చితంగా చెప్పాలని అన్నారు. మాటల గారడీతో రైతులను మభ్యపెట్టడం మంచిది కాదని హితవు పలికారు.