: అక్కడ తప్పించుకున్నాడు... ఇక్కడ దొరికిపోయాడు


తమిళనాడులోని పుదుకొట్టాయ్ గ్రామానికి చెందిన ఫైరోజ్ ఖాన్ అనే వ్యక్తి సింగపూర్ విమానాశ్రయాధికారులను మభ్యపెట్టి 6 కేజీల బంగారంతో చెన్నై చేరుకున్నాడు. బంగారం అక్రమ రవాణాపై భారత కస్టమ్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో అతను చెన్నైలో పట్టుబడ్డాడు. బిస్కెట్ల రూపంలో ఉన్న ఆ బంగారం విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని చెన్నై విమానాశ్రయాధికారులు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారంపై విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News