: లోక్ సభలో తెలుగులో ప్రసంగించిన మురళీమోహన్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ ఈ రోజు లోక్ సభలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొత్తం తెలుగులోనే కొనసాగింది. ప్రసంగంలో... పెరుగుతున్న కాలుష్యంపట్ల మురళీమోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల నరికివేతను అరికట్టి... కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు. వర్షాల ద్వారా వచ్చే నీటిని సముద్రం పాలవకుండా చూడాలని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవహించే నీటిని నిలువరించాలని, నిలువరించిన నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలని కోరారు. దేశంలో అపార వనరులు ఉన్నాయని... పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా అనేక మందికి జీవనోపాధి లభిస్తుందని తెలిపారు.