: సుబ్రతారాయ్ కు బెయిల్ నిరాకరణ
సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, సహారా ఆస్తులను న్యూయార్క్, లండన్ లో తాకట్టు పెట్టేందుకు కోర్టు అంగీకరించింది. పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన రూ.24వేల కోట్ల కేసులో కోర్టు ముందుకు హాజరుకాకపోవడంతో మూడు నెలల కిందట ఢిల్లీ పోలీసులు సుబ్రతాను అరెస్టు చేశారు. దాంతో, మార్చి 4వ తేదీ నుంచి ఆయన తీహార్ జైల్లో రిమాండులో ఉంటున్నారు. అయితే, బెయిల్ కోసం రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీం గడువిచ్చినప్పటికీ ఇంతవరకూ సహారా చెల్లించలేకపోయింది.