: మోడీ అమెరికా ఆహ్వానాన్ని రద్దు చేయాలంటూ సిక్ రైట్స్ గ్రూప్ పిటిషన్
అమెరికాలో పర్యటించాలంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో మోడీకి పంపిన ఆహ్వానాన్ని క్యాన్సిల్ చేయాలంటూ న్యూయార్క్ కు చెందిన సిక్ రైట్స్ గ్రూప్ కోరింది. ఈ మేరకు వైట్ హౌస్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన హింసను సమర్థించినందుకు బీజేపీని తమ దేశంలో నిషేధించాలనీ, ఈ విషయంలో మోడీపై అభ్యంతరం వ్యక్తం చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైన కూడా వారు కేసు వేశారు.