: 'తీన్ మార్' హీరోయిన్ కృతి కర్బందాకు తప్పిన ప్రమాదం


'తీన్ మార్' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైన కృతి కర్బందా అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా కర్నాటకలోని హసన్ లో ఉన్న చిరాంత్ హోటల్ లోని ఎగ్జిక్యూటివ్ సూట్ ఆమెకు కేటాయించారు. షూటింగ్ ముగిసిన తరువాత గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని స్నానం చేసిన కృతి, టీవీ చూస్తూ నిద్రపోయింది. కాస్సేపటికి నిప్పులు అంటుకున్న శబ్దం రాగా నిద్రలేచింది. ఏమీ కనిపించకపోవడంతో కలలో అనుకుని మళ్లీ నిద్రపోయింది. మళ్లీ శబ్దం రావడంతో మేల్కొని చూడగా గదిని మంటలు నెమ్మదిగా అలుముకుంటున్నాయి. దీంతో షాక్ తిని తేరుకున్న కృతి తడి టవల్ ఒంటికి చుట్టుకుని కేకలు వేసింది. ఆమె కేకలు విన్న సినిమా, హోటల్ సిబ్బంది, వచ్చి తలుపులు తెరిచి మంటలార్పారు. దీంతో ఆమె ఊపిరిపీల్చుకున్నారు. కాగా, సినిమా షూటింగ్ లలో అగ్నిప్రమాదాలు సంభవించడం సర్వసాధారణం. హోటల్ రూంలో అగ్నిప్రమాదం సంభవించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. చావు అంచులను చూసి వచ్చానని ఆమె అభిప్రాయపడ్డారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News