: అమెరికా డ్రోన్ దాడుల్లో ఆరుగురు ఆల్ ఖైదా నేతలు హతం


పాకిస్తాన్ ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఆరుగురు ఆల్ ఖైదా నేతలు హతమయ్యారు. ఈ వివరాలను ఆల్ ఖైదా వెల్లడించింది. జులై 10న దత్తా ఖేల్ ప్రాంతంలోని డోగా మదాఖేల్ గ్రామంపై డ్రోన్ దాడులు జరిగాయని... ఆ దాడుల్లో తాము ఆరుగురు నేతలను కోల్పోయామని ప్రకటించింది. ఈ ప్రాంతం ఆల్ ఖైదా, తెహ్రీక్ ఇ తాలిబాన్, లష్కర్ ఇ జిల్, హక్కానీ నెట్ వర్క్ లకు అడ్డా లాంటింది. ఆల్ ఖైదాకు చెందిన వ్యూహాత్మక ప్రణాళికలు, పథకాల కమిటీ చీఫ్ సనాఫీ అల్ నాజర్ (సిరియాలో ఉంటాడు) ఈ వివరాలను ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించాడు. ఇతను ఒసామా బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడు.

  • Loading...

More Telugu News