: మామిడి పళ్లలో ఇక టెంక ఉండదు...!


మామిడి పండ్లు రంగు, రుచి, మధురమైన వాసనల మేలు కలయిక. అంత రుచికరమైన మామిడి పండ్లలో పానకంలో పుడకలా పెద్ద టెంక! ఆ టెంక లేకపోతే మామిడి పండు నిండా రసం, గుజ్జు...ఆహా ఎంత బాగుంటుందో కదా? సరిగ్గా ఇలాంటి ఆలోచనే శాస్త్రవేత్తలకు వచ్చింది. గింజలు లేని ద్రాక్షను సృష్టించగా లేనిది, టెంక లేని మామిడి ఎందుకు సాధ్యం కాదు? అని ఆలోచించారు. పరిశోధనలు చేశారు. రత్న, అల్ఫోన్సో (కలెక్టరు) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో టెంకలేని మామిడి పండ్లను రూపొందించారు. ఈ రకానికి సింధు అని పేరు పెట్టారు. దీనిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాటి ఫలితాలు ఒకేలా వస్తున్నాయో లేదో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సింధు రకాన్ని భారీగా తోటల్లో వేయడంతో పాటు, ఇళ్లలో వేసినా ఒకేలాంటి ఫలితాలు వచ్చేలా పరిశోధనలు చేస్తున్నారు. 2015 నాటికి రైతులకు సింధు రకం మామిడి మొక్కలు అందుబాటులోకి రానున్నాయని బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యాన శాఖ చైర్మన్ వీబీ పటేల్ తెలిపారు. సింధు రకం మామిడి పండు ఒక్కోటి 200 గ్రాముల బరువు తూగుతుందని ఆయన వెల్లడించారు. పీచు కూడా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్ లో సింధు రకం పళ్లను శాస్త్రవేత్తలు రూపొందించారు.

  • Loading...

More Telugu News