: ఆగస్ట్ ఒకటిన విజయవాడ రానున్న సచిన్


విజయవాడ క్రీడాభిమానులకు శుభవార్త. 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ ఆగస్ట్ ఒకటిన విజయవాడకు రానున్నాడు. తెలుగు సినిమా అగ్రనిర్మాత పి.వి.పి.ప్రసాద్ విజయవాడలో పి.వి.పి స్క్వేర్ అనే పేరుతో భారీ షాపింగ్ మాల్ ను నిర్మించారు. ఈ షాపింగ్ మాల్ ను సచిన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పి.వి.పి స్క్వేర్ సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్. సచిన్ తో పాటు ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు...టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. పుట్ బాల్ క్రీడను భారతదేశంలో ప్రోత్సహించడానికి రిలయన్స్ తో కలసి ఇండియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ప్రారంభించిన ఇండియన్ సూపర్ లీగ్ లో కోచి ఫ్రాంచైజీను సచిన్ తో కలిసి పీవీపీ సంస్థ కొనుగోలు చేసింది.

  • Loading...

More Telugu News