: మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై సుప్రీంలో పిటిషన్


భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవ్యవస్థలో అవినీతిపై కోర్టు పరిధిలో విచారణ జరిపించాలని అందులో కోరారు. న్యాయవాదులు రాజరామన్, సతీశ్ గల్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తి పదవీకాలం పొడిగింపు విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాజీపడ్డారంటూ కట్జూ ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News